వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్ పై పిటిషన్

వాట్సాప్ పేమెంట్స్ ఆప్షన్ పై పిటిషన్

మోస్ట్ పాపులర్ సోషల్ మీడియా వాట్సాప్ ను ఇండియాలో పేమెంట్స్ సర్విస్ నుంచి తప్పించాలని లేదా కంపెనీకి చెందిన గ్రీవెన్స్ ఆఫీసర్ ను నియమించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సెంటర్ ఫర్ అకౌంటబిలిటీ అండ్ సిస్టమిక్ చేంజ్ అనే సంస్థకు చెందిన ప్రతినిధులు ఈ పిటిషన్ ఫైల్ చేశారు. వాట్సాప్ అనేది విదేశీ సంస్థ కాబట్టి ఆర్థిక లావాదేవీలకు అవకాశం కల్పించరాదన్నారు. దానికి ఇండియాలో ఆఫీసు గానీ, గ్రీవెన్స్ అథారిటీ గానీ లేదని.. ఇప్పటికే అనేక రకాల సామాజిక సమస్యలకు కారణమవుతున్న వాట్సాప్ కు ఏ నియంత్రణా లేకుండా మనీ పేమెంట్స్ కు అవకాశం కల్పించరాదన్నారు. దాని సర్వర్ కూడా ఇండియాలో లేదని, అలాంటప్పుడు ఇండియాలోని ఖాతాదారుల సమాచారం ఎలా సురక్షితంగా ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎలాంటి నిఘా, నియంత్రణ లేకుండా పేమెంట్స్ నిర్వహిస్తున్న వాట్సాప్ ను కట్టడి చేసేలా ఆర్బీఐ ఆదేశించేలా చూడాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

వాట్సాప్ కు ఇండియాలో 20 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఆ సంఖ్య రోజురోజూ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో యూజర్స్ విశ్వాసం చూరగొనాలంటే తాజా పిటిషన్ తరువాతనైనా వాట్సాప్ తగిన చర్యలు తీసుకోక తప్పదంటున్నారు నిపుణులు.