వివాదాల హీరోకి చియాన్ ఆశీస్సులు

వివాదాల హీరోకి చియాన్ ఆశీస్సులు
ర‌జ‌నీ, క‌మ‌ల్, సూర్య‌, విక్ర‌మ్ త‌ర‌వాత ప్ర‌యోగాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు శింబు. అద్భుత‌మైన ప్ర‌తిభ ఉన్న హీరోగా అత‌డిని త‌మిళ‌ప్ర‌జ‌లు ఏనాడో గుర్తించారు. అయితే ప్ర‌తిభ ఉన్నా, అత‌డికి కాలం క‌లిసి రాలేదు. వివాదాలు మ‌రింత‌గా దిగ‌జార్చాయి. ఓ ర‌కంగా శింబు ఊహించ‌ని రీతిలో కొన్ని వివాదాల్లో త‌ల‌దూర్చి, అన‌వ‌స‌ర ప్రేమాయ‌ణాల్లో మున‌క‌లేసి త‌న కెరీర్‌ని తానే చెడ‌గొట్టుకున్నాడ‌న్న టాక్ వినిపించింది. క‌థానాయిక‌ల‌తో వివాదాలు, నిర్మాత‌ల‌తో వివాదాలు అత‌డి పుట్టి ముంచాయి. అయినా శింబు ఎప్ప‌టిక‌ప్పుడు కంబ్యాక్ కోసం ప్ర‌య‌త్నాలు సాగిస్తూనే ఉన్నాడు. లేటెస్టుగా శింబుకి గ‌లాట్ట న‌క్ష‌త్ర అవార్డుల్లో యూత్ ఐక‌న్ అవార్డునివ్వ‌డం, దానిని చియాన్ విక్ర‌మ్ చేతుల‌మీదుగా అందించ‌డం త‌మిళ సినీవ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ అవార్డు అందుకుంటున్న వేళ శింబు ఎంతో ఎమోష‌న్ అయ్యి విక్ర‌మ్ పాదాల్ని తాకి ఆశీస్సులు అందుకున్నాడు. లైఫ్‌లో ఎన్నిటినో ఎదుర్కొని ఇప్పుడు అత‌డు తిరిగి ట్రాక్‌లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్న వేళ అత‌డిలో పూర్తి ప‌రిణ‌తి క‌నిపించింద‌ని అంతా పొగిడేస్తున్నారు. మొత్తానికి ప్ర‌యోగాల హీరో, ప్ర‌తిభావంతుడు బౌన్స్ బ్యాక్ అవ్వాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చూద్దాం.. అత‌డు ఎప్ప‌టికి బౌన్స్ బ్యాక్ అవుతాడో!