ఆ సబ్‌రిజిస్ట్రార్‌పై వేటు..

ఆ సబ్‌రిజిస్ట్రార్‌పై వేటు..

ఆ ఇన్‌ఛార్జి సబ్‌ రిజిస్ట్రార్‌ నిబంధనలు విడిచారు.. నియమాలు మరిచారు. నిషేధిత జాబితాలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూమూలకు ఎడాపెడా రిజిస్ట్రేషన్లు చేసేశారు. ఈ వ్యవహారం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఇంకేముంది.. వెంటనే ఆయనపై వేటు పడింది. గండిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సీనియర్‌ అధికారి అనిల్‌.. ఇటీవలే ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు. వెనువెంటనే అక్రమ రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. పుప్పాలగూడ గ్రామపంచాయతీ పరిధిలో కాందీశీకులకు చెందిన భూములతోపాటు నిషేధిత జాబితాలో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ వ్యవహారం తెలియడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణలో అడ్డగోలుగా చేసిన అయిదు రిజిస్ట్రేషన్లు బయటకు రావడంతో అనిల్‌ను సస్పెండ్‌ చేశారు.