18న యడ్యూరప్ప సీఎం కావాలని భావిస్తున్నా..

18న యడ్యూరప్ప సీఎం కావాలని భావిస్తున్నా..

తనకు మంచి మిత్రుడు యడ్యూరప్ప ఈ నెల 18న సీఎం అవుతారని ఆశిస్తున్నానంటూ బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ లో స్పందించారు. దేశంలో ఆసక్తిరేపుతున్న కర్ణాటక ఫలితాలపై సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. లింగాయత్ లను విభజించాలని సిద్ధరామయ్య భావించినప్పుడే.. తాను.. ఆ పార్టీ ఆత్మహత్యకు పాల్పడుతోందని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధిస్తుందన్న తన ముందస్తు అంచనాలు నిజమవుతున్నాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇక కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే   22వ భాజపా పాలిత రాష్ట్రంగా కన్నడసీమ కానుంది.