రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు...

రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు...

తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరం అంతటా కారుమబ్బులు కమ్ముకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం పడుతుంది. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, ఎస్సార్‌ నగర్, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, అమీర్‌పేట్‌, పంజాగుట్ట, కోటి ప్రాంతాలతో పాటు పలు చోట్ల స్వల్పంగా వర్షం కురుస్తోంది. దీంతో మధ్యాన్నం 40 డిగ్రీలకు పైగా నమోదైన ఉష్ణోగ్రతలతో వేడెక్కిన నగరం ఒక్కసారిగా చల్లబడింది.

మరోవైపు మెదక్‌ జిల్లాలోని అందోల్‌ మండలం జోగిపేట, వట్‌పల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం కురవడంతో.. విక్రయ కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్ధిపేటలోని నారాయణ రావు పేట్‌, చిన్న కోడూరు  మండలాల్లో వర్షం కురుస్తోంది. ఇక వికారాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన పడుతోంది.