సమంతకు పోటీ తప్పడం లేదు !

సమంతకు పోటీ తప్పడం లేదు !

అక్కినేని సమంత పవన్ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న ద్విభాషా చిత్రం 'యు టర్న్' సెప్టెంబర్ 13న విడుదలకానుంది.  నిన్నటి వరకు ఏ సినిమాలు ఆ రోజును విడుదల తేదీగా నిర్ణయించుకోలేదు.  దీంతో ఆ వారం మొత్తం సమంతకు ఎలాంటి పోటీ లేకుండా కలిసొచ్చినట్టేనని అందరూ అనుకున్నారు. 

కానీ ఇప్పుడు హీరో సుధీర్ బాబు కొత్త సినిమా 'నన్ను దోచుకుందువటే' సెప్టెంబర్ 13న విడుదలవుతుందని సమాచారం.  ఆర్‌.ఎస్.నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది.  'సమ్మోహనం' చిత్రంతో సుధీర్ బాబు మంచి హిట్ అందుకుని ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ నెలకొని ఉంది.  దీంతో సమంతకు సెప్టెంబర్ 13న సోలో రిలీజ్ దొరక్కపోగా కొంత పోటీ కూడ తప్పేలా లేదు.