టీడీపీని బాబు కబ్జా చేశారు..

టీడీపీని బాబు కబ్జా చేశారు..

ఆగర్తలాలో బీజేపీ జెండాను ఎగురవేశామని.. అమరావతిలోనూ ఎగుర వేస్తామని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ అన్నారు. ఇవాళ నరసరావుపేటలో జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌.. 9 నెలల్లో అధికారంలోకి తెచ్చారని.. అలంటా పార్టీని చంద్రబాబు కబ్జా చేశారని విమర్శించారు. పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు, కుటుంబసభ్యలను అభివృద్ధి చేసిన బాబు.. ప్రజలను మాత్రం విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరి తదితరులు పాల్గొన్నారు.