బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో స్టార్ నటుడు !

బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో స్టార్ నటుడు !

 

కమెడియన్ నుండి హీరోగా మారిన తర్వాత సునీల్ కెరీర్ కొన్నాళ్ళు బాగానే సాగినా ఆ తరవాత చాలా డల్ అయిపోయింది.  దీంతో సునీల్ మళ్ళీ తన పాత ఫార్మాట్ కు వచ్చేసి సపోర్టింగ్ రోల్స్ చేస్తున్నాడు.  స్నేహితుడు త్రివిక్రమ్ కూడ అతనికి బాగానే సపోర్ట్ చేస్తున్నాడు.  ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా రూపొందించిన 'అరవింద సమేత'లో ఒక మంచి రోల్ ఇచ్చిన ఆయన త్వరలోనే అల్లు అర్జున్ హీరోగా చేయనున్న కొత్త సినిమాలో సైతం ఒక మంచి రోల్ ఇవ్వనున్నాడట.  మరి ఆ పాత్ర ఏమిటో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.