గవాస్కర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

గవాస్కర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం..

టీమిండియా మాజీ క్రికెటర్లు, ప్రస్తుత కామెంటేటర్లు సునీల్‌ గవాస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌లకు తృటిలో ప్రమాదం తప్పింది. లక్నోలో భారత్‌-వెస్టిండీస్‌ల మధ్య నిన్న జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో గవాస్కర్‌, మంజ్రేకర్‌లు కామెంటరీ చెప్పారు. కామెంటరీ చెబుతున్న సమయంలో  కామెంటరీ బాక్స్‌ అద్దాలు విరిగిపడడంతో వీరికి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్టేడియం వర్గాలు తెలిపాయి. నిర్వాహకుల తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేలింది.