శాంతి కావాలంటోన్న సన్నీలియోన్..!!

శాంతి కావాలంటోన్న సన్నీలియోన్..!!

సన్నీలియోన్.. ఇండియాలో టాప్ హీరోయిన్లలో ఒకరు.  నార్త్, సౌత్ సినిమాలు వరసగా చేస్తూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం సన్నీలియోన్ మలయాళంలో వరసగా సినిమాలు చేస్తున్నది.  మమ్మూట్టితో మధుర రాజా సినిమాలో ఆడిపాడిన సన్నీలియోన్, రంగీలా పేరుతో నిర్మితమౌతున్న మలయాళం మూవీలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నది.  

సినిమాలు చేస్తూ.. మరోవైపు స్టార్ స్టక్ పేరుతో సౌందర్య ఉత్పత్తులకు ప్రచారం చేసుకుంటూ బిజీగా మారింది.  అంతేకాదు, సోషల్ మీడియాలో ఫోటోలు చేస్తూ.. వాటిని వైరల్ గా మార్చుకుంటున్న సన్నీ లియోన్ రీసెంట్ గా ట్విట్టర్ లో ఓ ఫోటోను షేర్ చేసింది.  విక్టరీ సింబల్ చూపిస్తూ.. వార్ కాదు.. పీస్ ముఖ్యం అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటం విశేషం.