సన్‌రైజర్స్ టార్గెట్ 188

సన్‌రైజర్స్ టార్గెట్ 188

ఐపీఎల్‌ 2018లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసి... హైదరాబాద్‌ ముందు 188 పరుగుల టార్గెట్ ఉంచింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగింది ఢిల్లీ జట్టు... రిషబ్ పంత్ చెలరేగి ఆడడంతో 187 పరుగులు చేసింది... కేవలం 63 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పంత్... ఏడు సిక్స్‌లు, 15 ఫోర్లతో చెలరేగి 128 పరుగులతో నౌటౌట్‌గా నిలిచి... జట్టుకు భారీ స్కోర్‌ సాధించిపెట్టాడు. ఇక హర్షల్ పటేల్ 24,  రాయ్ 11, పృథ్వీ 9 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలింగ్‌లో షకీబ్ 2 వికెట్లు తీయగా... భువనేశ్వర్ కుమార్‌ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు.