సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ త్వరలో..!!?

సూపర్ స్టార్  కృష్ణ బయోపిక్ త్వరలో..!!?

బాలీవుడ్ లో బయోపిక్ లకు కొరతలేదు.  నిత్యం ఏదో ఒక బయోపిక్ సినిమా అక్కడ విడుదలౌతుంటూనే ఉంటుంది.  ఈ సంస్కృతి ఇప్పుడు టాలీవుడ్ కు పాకింది.  మహానటి ఇచ్చిన కిక్ తో వరసగా సినిమా చేస్తున్నారు.  ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్నది.  కత్తి కాంతారావు  జీవిత చరిత్రలో మరో సినిమా తెరకెక్కుతుండగా.. అక్కినేని నాగేశ్వర రావు జీవితం ఆధారంగా సినిమా చేసే ఆలోచనలో అక్కినేని కుటుంబం ఉన్నట్టుగా సమాచారం.  

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన హీరో ఎవరు అంటే సూపర్ స్టార్ కృష్ణ అనే అంటారు.  కౌబాయ్ సినిమాలను తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేసింది సూపర్ స్టార్ కృష్ణానే.  కలర్, స్కోప్ ఇలా ఎన్నో మార్పులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరోగా సూపర్ స్టార్ కృష్ణకు పేరుంది.  500 పైచిలుకు సినిమాల్లో నటించిన ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవ అంతాఇంతా కాదు.  ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేయబోతున్నారట.  ఈ విషయాన్ని కృష్ణ అల్లుడు హీరో సుదీర్ బాబు వెల్లడించారు.  త్వరలోనే సూపర్ స్టార్ కృష్ణ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతుందని, ఆ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని సుదీర్ బాబు పేర్కొన్నారు.