సూపర్ స్టార్ కు సూపర్బ్ గిఫ్ట్..!!

సూపర్ స్టార్ కు సూపర్బ్ గిఫ్ట్..!!

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ముద్దుల కూతురు సౌందర్య రజినీకాంత్ వివాహం అంగరంగ వైభోగంగా జరిగింది.  ఈ వివాహానికి అతి కొద్దిమంది వ్యక్తులను మాత్రమే అతిధులుగా పిలిచారు.  సౌందర్యకు ఇది రెండో వివాహం.  గతంలో ఆమె అశ్విన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది.  కొన్ని విభేదాల కారణంగా 2017 వ సంవత్సరంలో విడిపోయారు.  వీరికి వేద్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. 

కాగా, ఈ వివాహ మహోత్సవానికి హాజరైన అతిధులు సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఊహించని గిఫ్ట్ ఇచ్చారట.  పెద్దింటి వివాహానికి హాజరయ్యే అతిధులు సాధారణంగా కాస్టలీ గిఫ్ట్స్ ఇస్తుంటారు.  అందుకు భిన్నంగా పర్యావరణానికి హాని తలపెట్టని వీడ్ బాల్స్ ను గిఫ్ట్ గా ఇచ్చారట.  ఆ గిఫ్ట్ లను చూసి రజిని ఆశ్చర్యపోయారట.  అన్నింటికంటే ఇవి చాలా స్పెషల్ గిఫ్ట్స్ అని రజినీకాంత్ చెప్పడం విశేషం.