హక్కుల నేతల గృహనిర్భంధం పొడిగింపు

హక్కుల నేతల గృహనిర్భంధం పొడిగింపు

భీమా కొరెగావ్ విచారణ కేసుతో సంబంధం ఉందన్న ఆరోపణలపై విరసం నేత వరవరరావుతో పాటు మరో ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తల గృహనిర్భంధాన్ని సుప్రీంకోర్టు మరోసారి పొడిగించింది. ఈ నెల 17 వరకు గృహనిర్భందం కొనసాగించాలని సుప్రీం ఆదేశించింది. ప్రముఖ విప్లవ రచయిత వరవరరావుతో పాటు పౌర హక్కుల కార్యకర్తలు గౌతమ్‌ నవ్‌లఖా, సుధా భరద్వాజ్‌, అరుణ్‌ ఫెరీరా, వెర్నన్‌ గొన్‌సాల్వేస్‌లను గత నెల 28న పుణె పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో స్వతంత్ర దర్యాప్తు చేయాలని రోమిలా థాపర్‌ తో సహా పలువురు సామాజిక కార్యకర్తలు వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది. విరసం నేత వరవరరావుతో పాటు మరో ఐదుగురు పౌరహక్కుల కార్యకర్తలకు తొలుత సెప్టెంబరు 6 వరకు గృహ నిర్బంధం విధించగా.. ఆ తర్వాత దాన్ని సెప్టెంబరు 12 వరకు పొడిగించింది. నేటితో ఆ గడువు ముగియడంతో గృహ నిర్బంధాన్ని మరోసారి పొడిగించింది.