శ్రీశ్రీ ట్రస్ట్ బిల్డింగ్ కూల్చేయండి : సుప్రీంకోర్ట్

శ్రీశ్రీ ట్రస్ట్ బిల్డింగ్ కూల్చేయండి : సుప్రీంకోర్ట్

కోల్ కతాలోని శ్రీశ్రీ రవిశంకర్ కి చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ట్రస్ట్ బిల్డింగ్ కూల్చేయాలంటూ సుప్రీంకోర్ట్ ఆదేశాలిచ్చింది. దీంతో ఈ భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారనే ఆరోపణలు నిజమయ్యాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనుబంధ సంస్థ విద్యా ధర్మ సనాతన్ ట్రస్ట్ కోల్ కతాలోని వెట్ ల్యాండ్ లో మూడంతస్థుల భవనాన్ని నిర్మించింది.

విద్యా ధర్మ సనాతన్ ట్రస్ట్ కోల్ కతాలో అక్రమంగా భవనాన్ని నిర్మిస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఈ బిల్డింగ్ ని నేలకూల్చాలంటూ ఆదేశించింది. అక్రమంగా నిర్మించిన ఈ నిర్మాణాన్ని కూల్చేయకపోతే వెట్ ల్యాండ్ మేనేజ్ మెంట్ అథారిటీ, రాష్ట్ర పర్యావరణ శాఖ చెరో రూ.50 లక్షలు జరిమానాగా చెల్లించాలని చెప్పింది. 

ఎన్జీటీ ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరుతూ ట్రస్ట్ సుప్రీంకోర్ట్ లో అప్పీల్ చేసింది. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్మాణం అక్రమమని ఎన్జీటీ ప్రకటించింది. ఈస్ట్ కోల్ కతా వెట్ ల్యాండ్స్ రోజూ 1,000 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి నగర పర్యావరణ పరిరక్షణ వాల్వ్ గా పని చేస్తోంది.