స్థానాల కేటాయింపుపై టీటీడీపీలో ఉత్కంఠ

స్థానాల కేటాయింపుపై టీటీడీపీలో ఉత్కంఠ

14 స్థానాలను ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయడంతో టీటీడీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఖరారైన 14 స్థానాల గురించి ఆశావహులు ఆరా తీస్తున్నారు. దాదాపు పది స్థానాలపై క్లారిటీ ఉందంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అశ్వారావు పేట, సత్తుపల్లి, ఖమ్మం నియోజకవర్గాలు తమవేనని ధీమాగా చెబుతున్నారు నేతలు. ఉప్పల్, ఖైరతాబాద్, శేరిలింగం పల్లి, కూకట్ పల్లి తమ  ఖాతాకేనంటోన్నారు. మక్తల్, దేవరకద్ర, నిజామాబాద్ రూరల్ పైనా తెలంగాణ తమ్ముళ్లు భరోసాతో ఉన్నారు. ఉదయమే చంద్రబాబుతో భేటీ అయిన టీటీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేటపై ధీమాతో ఉన్నారు. ఫ్యామిలీకి ఒక్కరికేనన్న ఫార్మూలాతో రాజేంద్ర నగర్, కోదాడ స్థానాలపైనా తమ్ముళ్లు ఆశలు పెట్టుకున్నారు. మిగిలిన స్థానాలేవనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చివరి నిమిషం వరకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని ఆశావహులు చెబుతున్నారు. చివరి నిమిషంలో కొన్ని మార్పులు చేర్పులు లేకపోలేదంటోన్నారు టీటీడీపీ అగ్ర నేతలు.