మైసూర్ ప్యాలస్ కు చిరంజీవి !

మైసూర్ ప్యాలస్ కు చిరంజీవి !

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న పిరియాడికల్ ఫిల్మ్ 'సైరా' సరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  త్వరలో చిత్ర యూనిట్ కొన్ని కీలక సన్నివేశాల కోసం మైసూర్ వెళ్లనున్నారు.  అక్కడున్న మైసూర్ ప్యాలస్ లో చిరు, నయనతారలపై చిత్రీకరణ జరగనుంది.  బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.  విజయ్ సేతుపతి, తమన్నా, సుదీప్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్లు ఈ సినిమాలో పలు కీలక పాత్రల్లో నటించనున్నారు.  వచ్చే ఏడాది సగంలో ఈ సినిమా ప్రేక్షకుల్ ముందుకురానుంది.