నా నువ్వే ఎలా ఉందంటే..?

నా నువ్వే ఎలా ఉందంటే..?

కళ్యాణ్ రామ్ తన లుక్ ను మార్చుకొని ఎమ్మెల్యేలో కొత్తగా కనిపించాడు.  మాస్ నుంచి బయటపడే ప్రయత్నం చేసిన కళ్యాణ్ రామ్ కు ఎమ్మెల్యే మంచి సపోర్ట్ చేసింది.  మాస్ తో పాటు కొద్దిగా క్లాస్ టచ్ ఇచ్చాడు.  ఈ సినిమా విజయవంతం కావడంతో.. మరో కొత్తప్రయత్నంగా పూర్తి లవ్ ఫీల్ టచ్ ఉన్న నా నువ్వే అంటూ ముందుకు వచ్చాడు.  మాస్ అప్పీల్ నుంచి బయటపడేందుకు చేసిన ఈ ప్రయత్నం ఎంతవరకు సఫలం అయిందో చూద్దాం.  సినిమా ట్రైలర్, టీజర్లు సూపర్ గా ఉన్నాయి.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఆ కెమిస్ట్రీ కేవలం ట్రైలర్, టీజర్లలే పరిమితం అయ్యాయని సినిమా చూస్తే అర్ధం అవుతుంది.  కళ్యాణ్ రామ్ ఈ తరహా ప్రేమకథా చిత్రాల్లో నటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ.. నటన పరంగా పర్వాలేదనిపించారు.  

180 వంటి డిఫరెంట్ చిత్రాన్ని తీసిన జయేంద్ర నానువ్వే విషయంలో ఫెయిల్ అయినట్టు తెలుస్తోంది.  కెమెరామెన్ పీసీ శ్రీరామ్ సినిమాను అందంగా చూపించడం, తమన్నా గ్లామర్ మినహా నా నువ్వేలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమి లేదని తెలుస్తోంది.  ఫస్ట్ హాఫ్ నుంచే దర్శకుడు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడట.  విధి పేరుతో నమ్మశక్యంకాని సన్నివేశాలను చిత్రీకరించి, ప్రేమకథలోని సహజత్వాన్ని దూరం చేశాడు దర్శకుడు.  విజువల్స్ పరంగా సాంగ్స్ చిత్రీకరణ అద్భుతంగా ఉన్నా.. నా నువ్వే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని టాక్.  పూర్తి వివరాలతో కూడిన విశ్లేషణ కావాలంటే మరికొద్ది సేపు వేచి ఉండాల్సిందే.