జనసేనలో చేరిన మాజీ సీఎస్.. కీలక బాధ్యత అప్పగింత..

జనసేనలో చేరిన మాజీ సీఎస్.. కీలక బాధ్యత అప్పగింత..

జనసేన పార్టీలోకి వలసలు కొనసాగుతోన్నాయి. ఇతర పార్టీల నుంచే కాకుండా... రాజకీయాలకు దూరంగా ఉన్నవాల్లు సైతం జనసేనలో చేరుతున్నారు. ఇవాళ బెజవాడలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావు. అనంతరం పవన్ కల్యాణ్ తన రాజకీయ సలహాదారుగా రామ్మోహన్‌రావును నియమించినట్టు జనసేన పార్టీ ప్రకటించింది. విజయవాడలో జనసేనాని సమక్షంలో పవన్ కల్యాణ్ రాజకీయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించారు రామ్మోహన్.