చెప్పిందే చేసిన ఎన్టీఆర్ !

చెప్పిందే చేసిన ఎన్టీఆర్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన డెడికేషన్ ను నిరూపించుకున్నారు.  గత నెల 28వ తేదీన   ఆయన తండ్రి, నటుడు, టీడీపీ నేత హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు.  దీంతో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న 'అరవింద సమేత' చిత్రానికి ఇంకొంత కాలంపాటు బ్రేకులు పడతాయని అనుకున్నారంతా. 

కానీ తారక్ మాత్రం తండ్రి అంత్యక్రియలు పూర్తిచేసి వెంటనే షూటింగ్ మొదలుపెట్టమని, తాను కూడ షూటింగ్లో పాల్గొంటానని త్రివిక్రమ్ కు చెప్పారు.  చెప్పిన ప్రకారమే ఎప్పటిలాగే ఈరోజు షూటింగ్లో పాల్గొన్నారు.  పని పట్ల అయన నిబద్ధతను చూసిన టీమ్ అందరూ తారక్ చెప్పినట్టే చేశారని ప్రశంసలు కురిపిస్తున్నారు.