ఏపి అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ కసరత్తు

ఏపి అసెంబ్లీ సమావేశాలపై టీడీపీ కసరత్తు

ఏపి అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ కసరత్తు చేస్తుంది.ఎన్నికల ముందు జరుగుతోన్న అసెంబ్లీ కావడంతో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపైనే టీడీపీ ప్రధాన ఫోకస్ పెట్టింది. రైతు రుణమాఫీ పూర్తి చెల్లింపు.. రూ. 2 వేల ఫించన్ అమలు..ఇతర సంక్షేమ పథకాలను సభలో ప్రధానంగా ప్రస్తావించాలని  అధికార పార్టీ భావిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లోపే రైతు రుణ మాఫీ పూర్తి చెల్లింపులు, ఫించన్ పెంపు వంటి అంశాలను అమల్లో పెట్టే అవకాశం ఉంది. రైతు రుణ మాఫీ చెల్లింపులకు  కావాల్సిన రూ. 9 వేల కోట్ల మేర నిధుల వేటలో ప్రభుత్వం ఉంది. త్వరలోనే నిధులు అందుబాటులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నెల 30న అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని సిఎం చంద్రబాబు యోచిస్తున్నారు.  ఆరు పనిదినాలు నిర్వహించే అవకాశం ఉంది.