రాష్ట్రపతితో టీడీపీ నేతల భేటీ

రాష్ట్రపతితో టీడీపీ నేతల భేటీ

రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌తో టీడీపీ బృందం ఇవాళ భేటీ కానుంది.  మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎంపీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రపతితో 21 మంది టీడీపీ నేతలు ఢిల్లీలో సమావేశమవుతున్నారు.  ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్రపతికి టీడీపీ బృందం ఫిర్యాదు చేయనుంది. ఏపీ భవన్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం రాష్ట్రపతి భవన్‌కు టీడీపీ నేతలు బయలుదేరారు.