తుమ్మలతో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా భేటీ...

తుమ్మలతో టీడీపీ ఎమ్మెల్యే మచ్చా భేటీ...

టీడీపీ ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు త్వరలోనే కారెక్కుతారనే ప్రచారం సాగుతున్న సమయంలో... ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో అలాంటిది ఏమీలేదని... అవి పుకార్లేనని ఖండించిన మచ్చా నాగేశ్వరరావు... ఇవాళ మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత తుమ్మల నాగేశ్వరరావుతో భేటీ అయ్యారు... దీంతో మరోసారి నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పుకోవడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. తుమ్మలతో భేటీ విషయాన్ని నాగేశ్వరరావు ధృవీకరించారు. తాను తుమ్మలను పరామర్శించడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన మచ్చా నాగేశ్వరరావు... ఇవాళ సత్తుపల్లి మండలం పాకలగూడెంలోని తుమ్మల గెస్ట్ హౌస్ లో ఆయనతో భేటీ అయ్యారు. టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ప్రచారం జరుగుతన్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.