పార్టీలన్ని ఏకతాటిపైకి రాక తప్పదు..

పార్టీలన్ని ఏకతాటిపైకి రాక తప్పదు..

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు ప్రధాని మోడీ పై మండిపడ్డారు. ఏపీకి వచ్చిన మోడీ కామెడీ చేశారని ఎద్దేశా చేశారు. ప్రధాని స్ధాయి వ్యక్తి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని అన్నారు. మోడీ తన భార్యకు తలాఖ్ చెప్పకుండా వదిలేశారని మేము కామెంట్ చేయవచ్చు. కానీ వ్యక్తిగత దూషణలు మా నైజం కాదని స్పష్టం చేశారు. ఫెడరల్ స్పూర్తిని గౌరవించని కేంద్ర ప్రభుత్వాలుంటే.. పార్టీలన్నీ ఏకతాటి మీదకు రాక తప్పదని హెచ్చరించారు. ఈ తరహా దీక్షలు చేపడుతున్నాం కాబట్టే.. ప్రధాని కూడా ఏపీకి అన్యాయం జరిగిందని అంటున్నారని తెలిపారు. హోదా ఇవ్వలేదు.. ప్యాకేజీ ప్రకటించి నిధులు కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఓపిక పట్టి వేచి చూశాకే పోరాట బాటపట్టామని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగం లేని ప్రకటనలు చేయవద్దని అశోక్ గజపతి రాజు కేంద్రానికి సూచించారు.