ఏపీలో 25లోక్ సభ స్థానాలు టీడీపీవే: ఎంపీ జేసీ

ఏపీలో 25లోక్ సభ స్థానాలు టీడీపీవే: ఎంపీ జేసీ

ప్రస్తుతానికి మా నాయకుడు చెప్పినట్లుగా రాజీనామా నిర్ణయాన్ని విరమించుకున్నానని తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన ఎన్ టీవీతో మాట్లాడుతూ, తాను రాజకీయా నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం ఇప్పుడు తీసుకున్నది కాదని, ఎప్పట్నుంచో అనుకుంటున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు చేశారు. మారుమూల పల్లెలలో సామాన్యులకు కూడా అర్ధమయ్యేలా మోడీ వ్యవహరించిన తీరును అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఉదృతంగా చేపట్టాలని అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత అనేక రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని, కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని పుంజుకోవాలని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి తెలుగుదేశం పార్టీకి 25 లోక్ స్ధానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఏపీ న్యాయం చేస్తామని మాట తప్పిన ప్రధాని మోడీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 2019 ఎన్నికల తరువాత బీజేపీ పెద్ద పార్టీగా ఆవిర్భవించినా, సొంత బలం మాత్రం తగ్గడం ఖాయమని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జోస్యం చెప్పారు.