సెలక్ట్ కమిటీ వేయకుండా బిల్లు పెట్టడమేంటి..?

సెలక్ట్ కమిటీ వేయకుండా బిల్లు పెట్టడమేంటి..?

ఈబీసీ బిల్లు ప్రవేశపెట్టిన తీరును తప్పుబట్టారు టీడీపీ ఎంపీ కేశినేని నాని... కృష్ణా జిల్లా నందిగామ మండలం మాగల్లులో మీడియాతో మాట్లాడిన ఆయన... సెలక్ట్ కమిటీ వేయకుండా.. రాజకీయ పార్టీలతో చర్చించకుండా బిల్లు ప్రవేశ పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లుపై మాట్లాడితే అందరికీ లాభదాయకంగా ఉండేదన్న ఎంపీ... ఈ బిల్లు ఆఖరి పార్లమెంటులో సమావేశాల్లో ప్రవేశపెట్టడాన్ని తప్పుబట్టారు. విధివిధానాలు రూపొందించకుండా బీజేపీ రాజకీయ లబ్ధికోసమే బిల్లును ప్రవేశపెట్టారని ఆరోపించారు ఎంపీ కేశినేని నాని.