కేంద్రంపై పోరాటానికి టీడీపీ కొత్త కమిటీ!

కేంద్రంపై పోరాటానికి టీడీపీ కొత్త కమిటీ!

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారంటూ ఎన్డీఏకి గుడ్‌బై చెప్పిన తెలుగుదేశం పార్టీ... పార్లమెంట్ లోపల, బయట పోరాటాన్ని ఉధృతం చేసింది... ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ, విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలంటూ దీక్షలు, ఆందోళనలు, సైకిల్ యాత్రలు చేస్తూ నిరసన తెలియజేస్తూనే ఉంది. అయితే ప్రత్యేక హోదా... విభజన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాల్సిందిగా ఎంపీలను ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. త్వరలో సమావేశం నిర్వహించుకుని స్ట్రాటజీ వర్కవుట్ చేయాలని సూచించిన టీడీపీ అధినేత... పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో కమిటీ రూపకల్పన చేయనున్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై ఈ పొలిటికల్ స్ట్రాటజీ కమిటీలో నిర్ణయం తీసుకోనున్నారు.