ఏపీలో ఎన్నికలు ఏకపక్షమే...

ఏపీలో ఎన్నికలు ఏకపక్షమే...

తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి అధికారంలోకి రాబోతోందనే నమ్మకాన్ని వెలిబుచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు... విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన... తెలంగాణలో మహాకూటమి అధికారం చెపట్టబోతోంది... ఇక వచ్చే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మాత్రం ఏకపక్షంగా జరగనున్నాయని... మళ్లీ తమదే అధికారమని దీమా వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్నటితో ప్రచారానికి తెరపడగా... రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.