ఉయ్యురులో జన్మభూమి రసాభాస

ఉయ్యురులో జన్మభూమి రసాభాస

కృష్ణా జిల్లా ఉయ్యురులో జన్మభూమి రసాభాస అయ్యింది.ఇళ్ల కేటాయింపు, ద్వాక్రా రుణాల మాఫీ అంశంపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగింది. టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, వైసీపీ నేత మాజీ మంత్రి పార్ధసారధి మధ్య మాటల యుద్ధానికి దిగారు.ఒకదశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇరుపార్టీల కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. దాంతో జోక్యం చేసుకున్న పోలీసులు వైసీపీ నేతలు పార్థ సారధి, రామ చంద్ర రావులను జన్మభూమి సభ నుంచి పంపేయడంతో గొడవ సద్దుమణిగింది.