రెండవ టెస్ట్ కు జట్టు ఇదే

రెండవ టెస్ట్ కు జట్టు ఇదే

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రేపటి నుండి రెండవ టెస్టు ఆడనుంది. కొద్దిసేపటి క్రితం బీసీసీఐ ఈ టెస్ట్ కు 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను పెట్టింది. మామూలుగా అయితే తుది జట్టును టాస్ వేసాక ప్రకటిస్తారు. దీనికి బిన్నంగా మ్యాచ్  జరగడానికి ఒక రోజు ముందే 12 మందితో కూడిన జట్టును ప్రకటించింది టీమిండియా. తొలి టెస్ట్ కు ముందు కూడా.. ఒక రోజు ముందే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రెండవ టెస్ట్ 12  మంది జాబితాలో తెలుగు ఆటగాళ్లు మహ్మద్‌ సిరాజ్‌, హనుమ విహారీలలకు చోటు దక్కలేదు. మొదటి టెస్ట్ 12 మంది ఆటగాళ్లనే బీసీసీఐ మళ్లీ ప్రకటించింది. శార్దూల్ ఠాకూర్ మళ్లీ బెంచ్ కే పరిమితం కానున్నాడు. ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లతో ఆడితే ఠాకూర్ తుది జట్టులో ఉంటాడు.

జట్టు:

విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, పృథ్వీ షా, చెటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్‌దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమి, శార్దూల్ ఠాకూర్.