తేజ్ ఐ లవ్ యు సెన్సార్ వివరాలు 

తేజ్ ఐ లవ్ యు సెన్సార్ వివరాలు 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రం తేజ్ ఐ లవ్ యు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. జూలై 6న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా ఇవాళే సెన్సార్ ముందుకు వెళ్ళింది. సెన్సార్ వారు ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను జారీ చేశారు. 

ఇదివరకే రిలీజ్ చేసిన ట్రైలర్ లో మంచి ఎంటర్ టైన్మెంట్ అంశాలు పుష్కలంగా కనిపించడంతో పాజిటివ్ హైప్ ఏర్పడింది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమ పరమేశ్వన్ హీరోయిన్ గా నటించింది. దర్శకుడు కరుణాకరన్..అందమైన ప్రేమ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్ ను జత చేసి తెరకెక్కించారు. గోపిసుందర్ అందించిన పాటలు కూడా శ్రోతలను బాగా ఆకట్టుకున్నాయి. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ మెగా హీరోకి ఏ చిత్రం హిట్ అయ్యేలానే కనిపిస్తోంది. ఈ ఎంటర్ టైనర్ ను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మించారు.