టీజేఎస్ అభ్యర్థులు వీళ్లే...

టీజేఎస్ అభ్యర్థులు వీళ్లే...

ఈ నెల 10న మహాకూటమి మొదటి జాబితా విడుదల కానుంది. కాంగ్రెస్ పార్టీ 94 స్థానాల్లో పోటీ చేయనుండగా.. 26 సీట్లను మహాకూటమి భాగస్వామ్య పార్టీలకు కేటాయించారు. ఇందులో టీజేఎస్ కు 8 స్థానాలను కేటాయించారు. టీజేఎస్ పోటీ చేసే 8 స్థానాల్లో ఆరు స్థానాల అభ్యర్థులు ఖరారు అయ్యారు. మిగిలిన రెండు స్థానాలు మిర్యాలగూడ, చెన్నూరులలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అయితే టీజేఎస్ చీఫ్ కోదండరామ్ పోటీకి దూరంగా ఉంటారని సమాచారం తెలుస్తోంది. కింది వారిని టీజేఎస్ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉంది.

# మెదక్ - జనార్ధన్ రెడ్డి
# దుబ్బాక - రాజ్ కుమార్
# సిద్దిపేట - భవానీ
# వరంగల్ ఈస్ట్ - గాదె ఇన్నయ్య
# మల్కాజిగిరి - దిలీప్
# మహబూబ్ నగర్ - రాజేందర్ రెడ్డి