తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చినట్టేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చినట్టేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఇవాళో..రేపో విస్తరణ ఉంటుందని ఊహాగానాలొచ్చినప్పటికీ.. మరో ఐదారు రోజుల వరకు ఆ ఛాన్స్‌ లేదని తెలుస్తోంది. ప్రగతి భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కేసీఆర్‌ భేటీ అయ్యారు. మంత్రివర్గ విస్తరణపై ఈ భేటీలో కేసీఆర్‌ ప్రస్తావించినట్టు తెలిసింది. రాబోయే ఐదారు రోజుల్లో విస్తరణ ఉంటుందని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.