ఆ పెళ్లికి అనుకోని అతిథి సీఎం...

ఆ పెళ్లికి అనుకోని అతిథి సీఎం...

సాధారణంగా తమ పెళ్లికి రావాలంటూ వీఐపీలను కలిసి ఆహ్వానం పలికినా వచ్చేది కష్టం... కానీ, అనుకోకుండా ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తమ పెళ్లికి వచ్చి ఆశీర్వదిస్తే మరి ఆ దంపతులకు షాకింగే... అలాంటి సంఘటనే తడికల్‌లో జరిగింది. ఆ అనుకోని అతిథి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యలో తడికల్ వద్ద ఓ వివాహం జరగడాన్ని గమనించారు. వెంటనే బస్సు ఆపాలంటూ ఆదేశించిన కేసీఆర్... నేరుగా  పెళ్లి మండపానికి వెళ్లి నూతన దంపతులను ఆశీర్వదించారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి ఈటల రాజేందర్, రసమయి బాలకిషన్ ఉన్నారు. కల్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామని ఈ సందర్భంగా ఆ దంపతులకు హామీ ఇచ్చారు కేసీఆర్.