రేపు ఢిల్లీకి... ఎల్లుండి ప్రధానితో భేటీ...

రేపు ఢిల్లీకి... ఎల్లుండి ప్రధానితో భేటీ...

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... రేపు హస్తినకు వెళ్లనున్నారు. ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. జోనల్ వ్యవస్థ సవరణలు ఆమోదించాలని ప్రధానిని కోరనున్నారు సీఎం. ఢిల్లీలో ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ జరగనుంది... ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం... వీటిపై జాతీయస్థాయిలో వివరించనున్నారు సీఎం కేసీఆర్. ఈ పథకాలపై సీఎంల సమావేశంలో మాట్లాడనున్న తెలంగాణ ముఖ్యమంత్రి... అవసరమైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు నాలుగు రోజులపాటు హస్తినలోనే మకాం వేయనున్నారు తెలంగాణ సీఎం.