ఢిల్లీలో చక్రం తిప్పుతాం...

ఢిల్లీలో చక్రం తిప్పుతాం...

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నట్టు స్పష్టం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... దేశంలో గుణాత్మక మార్పు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రయత్నాలను చేస్తున్న కేసీఆర్... ఇప్పటికే కోల్‌కతా, బెంగళూరు, చెన్నైలో పర్యటించిన మద్దతు కూడగట్టే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్‌యాదవ్‌తో సమావేశమైన కేసీఆర్... కీలక చర్చలు జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో పరివర్తన, గుణాత్మక మార్పు రావాలని దాని కోసం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ప్రయత్నిస్తున్నానని తెలిపారు.

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్... 2019 ఎన్నికల కోసం చేస్తున్న చిన్నప్రయత్నం కాదని... దేశంలో గుణాత్మకమార్పు తీసుకువచ్చేందుకే ప్రయత్నిస్తున్నామన్న తెలంగాణ ముఖ్యమంత్రి... గత నెల రోజులుగా అఖిలేష్‌ యాదవ్‌తో టచ్‌లో ఉన్నానని... ఈ భేటీలో దేశరాజకీయ వ్యవస్థ, సుపరిపాలనపై చర్చించామన్నారు. ఇది రాజకీయ పార్టీల కూటమి కాదని... ఏళ్లు గడిచిపోయినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయలేదన్నారు. దేశంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. దేశ రాజకీయాల్లో పరివర్తన రావాల్సిన అవసరం ఉందని... ఆ మార్పు కోసమే తాము ప్రయత్నం చేస్తున్నామన్నారు. చైనా లాంటి దేశాలస్థాయిలో మనమెందుకు అభివృద్ధి చెందలేమని ప్రశ్నించిన కేసీఆర్... దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది... అందుకే మా ప్రయత్నం చేస్తున్నామన్నారు.