గ్రామ సమగ్ర వికాసానికి పాటు పడాలి

గ్రామ సమగ్ర వికాసానికి పాటు పడాలి

కొత్తగా నియామకమయ్యే పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు కలిసి కట్టుగా పనిచేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతి భవన్ లో సర్పంచులు, పంచాయితీ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమీక్ష నిర్వహించిన ఆయన... కొత్త  సర్పంచులు మూస పద్ధతిలో కాకుండా, గ్రామాల సమగ్ర వికాసానికి పాటుపడే ఉద్యమ కారులుగా మారాలని ఆకాంక్షించారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచులకు ఫిబ్రవరి నుంచి మే వరకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభత్ర పెంచడం లక్ష్యంగా కొత్తగా రూపొందించిన చట్టంపై అవగాహన కల్పించాలని కోరారు. ప్రతీ గామ పంచాయతీకి కొత్త చట్టం తెలుగు ప్రతులను పంపించాలని సీఎం చెప్పారు.