పోచారానికి కేసీఆర్ పరామర్శ..

పోచారానికి కేసీఆర్ పరామర్శ..

అసెంబ్లీ స్పీకర్ పోచారం, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి పోచారం గ్రామానికి వెళ్లిన ఆయన... మాతృవియోగంతో పుట్టెడు దుఖంలో ఉన్న శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, స్పీకర్‌ పోచారం తల్లి పాపవ్వ(107) అనారోగ్యంతో రెండు రోజుల క్రితం మృతిచెందారు... బుధవారం ఆమె స్వగ్రామమైన పోచారంలో అంత్యక్రియలు నిర్వహించారు. అనివార్య కారణాలతో నిన్న అంత్యక్రియలకు హాజరుకాలేకపోయిన సీఎం కేసీఆర్... స్పీకర్‌ పోచారంను ఫోన్‌లో పరామర్శించారు. ఇవాళ నేరుగా పోచారం గ్రామానికి వెళ్లి పరామర్శించారు. బాన్సువాడ మండలంలోని పోచారం గ్రామానికి వెళ్లిన సీఎం కేసీఆర్ వెంట నిజామాబాద్ ఎంపీ కవిత, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, సీఎస్ జోషి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఉన్నారు.