జూన్ నుంచి ట్రైబల్ యూనివర్శిటీ క్లాసులు..?

జూన్ నుంచి ట్రైబల్ యూనివర్శిటీ క్లాసులు..?

తెలంగాణలో ట్రైబల్ యూనివర్సిటీలో జులై నుంచి 30 మంది విద్యార్థుల చొప్పున ఆరు కోర్సుల్లో తరగతులు ప్రారంభించాలని చీఫ్ సెక్రటరీ జోషి ఆదేశించారు.  గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, అటవీశాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటి అధికారులతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్కే జోషి... తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. యూనివర్సిటిలో స్ధానిక గిరిజన యువత కోసం 30 శాతం సూపర్ న్యూమరీ సీట్లను కేటాయించాలని చెప్పారు. కాంపౌండ్ హాల్ నిర్మాణాన్ని గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం చేపట్టాలన్నారు. గిరిజన యూనివర్సిటీ కమిటీలో ఉన్నత విద్య, గిరిజన సంక్షేమం, అటవీశాఖ ముఖ్యకార్యదర్శులు సభ్యులుగా నియమించాలని కోరారు.