కష్టపడి సాధించాం... ఇష్టపడి అభివృద్ధి చేసుకుందాం...

కష్టపడి సాధించాం... ఇష్టపడి అభివృద్ధి చేసుకుందాం...

కష్టపడి సాదించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇష్టపడి అభివృద్ధి చేసుకోవాలనే సకల్పంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అనేక సంక్షేప పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు తెలంగాణ డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. జనగామలో ఆయన మాట్లాడుతూ... జనగామ నియోజకవర్గం కరువుకు నిలయంగా ఉండేది... కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో 24 గంటల కరెంట్‌తో పాటు దేవాదుల ద్వారా గోదావరి జలాలతో సాగు నీరు కూడా రైతాంగానికి అందజేస్తుందన్నారు. గజ్వేల్,  సిద్దిపేట తర్వాత జనగామ నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచి నీరు అందిస్తున్నామన్న కడియం... పేదింటి అడబిడ్డలకు కళ్యాణాలక్షి, షాదీ ముభారఖ్ పథకాల ద్వారా పెళ్లి ఖర్చుకు రూ.లక్షా 116 అందిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారే అన్నారు.