మే 18న తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్

మే 18న తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో కోర్సుల ప్రవేశానికి జరిగిన ఎంసెట్ పరీక్ష ఫలితాలను మే 18వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఫలితాలు ప్రకటిస్తామన్నారు.. రెస్పాన్స్ షీట్‌లను అభ్యర్థుల ఈ మెయిల్స్‌కు 8వ తేదీ నుంచి పంపిస్తామని.. ఏమైనా అభ్యంతరాలుంటే 10వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు తెలియజేయవచ్చన్నారు. వాటిని పరిశీలించిన అనంతరం తుది కీ ప్రకటిస్తామన్నారు. ఆన్‌లైన్ విధానం కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ.. అందువల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని.. పరీక్ష పూర్తి అయిన 10 రోజుల్లోనే ఫలితాలు ఇవ్వడం సాధ్యమవుతుంటే అందుకు ఆన్‌లైన్ పరీక్షా విధానమే కారణమన్నారు. తద్వారా విద్యార్ధులు త్వరగా కళాశాలల్లో ప్రవేశించవచ్చని ఆయన అన్నారు.