నేటి నుంచి తెలంగాణ ఎంసెట్

నేటి నుంచి తెలంగాణ ఎంసెట్

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ పరీక్షలు ఇవాళ్టీ నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహిస్తున్నారు. 2, 3 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్ష.. 4,5,7 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 2,21,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణకు రెండు రాష్ట్రాల్లోని 18 జోన్ల పరిధిలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రోజుకు రెండు విడతల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఒక్కో సెషన్‌లో సుమారు 25 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఆన్‌లైన్ పరీక్షలకు నిమిషం నిబంధనను అమలు చేస్తున్నందున.. నిర్దేశిత సమయం కంటే ఆలస్యమైతే పరీక్షకు అనుమతించేది లేదని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. పరీక్షలు ముగిసిన 7 లేదా 8వ తేదీ రాత్రి ప్రాథమిక కీలను విడుదల చేస్తామని.. ఈ నెల 15న ఫలితాలను, ర్యాంకులను ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.