రైతుబంధుకు ముహూర్తం ఖరారు

రైతుబంధుకు ముహూర్తం ఖరారు

తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించనుంది. ఈ మేరకు అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వానికి ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకమని, అమలులో ఎలాంటి ఇబ్బందులు..లోటు పాట్లు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రైతు బంధ కార్యక్రమంపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ జరిగే ప్రదేశంలో షామియానాలు, మంచి నీరుఏర్పాటు చేసి రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమం జరిగే గ్రామాల్లో మంత్రులు, ఉన్నతాధికారులు పర్యటించి, పర్యవేక్షించాలని తెలిపారు. ఈనెల 10న హుజురాబాద్‌ ఇందిరానగర్‌లో ఉదయం 11 గంటలు ఈ కార్యక్రమాన్నీ సీఎం ప్రారంభిస్తారు. 11:15 గంటలను అన్ని జిల్లాలోనూ  ఈ కార్యక్రం ప్రారంభమౌతుంది. మరుసటి రోజు 11వ తేదీన ఉదయం 7 నుండి 11 వరకు పంపిణి జరిపి..తరువాత సాయంత్రం 5 నుంచి 7:30 వరకు పంపిణి జరపాలని అధికారులకు  సీఎం తెలిపారు.   ఏ గ్రామంలో ఏ రోజున ఈ కార్యక్రమం జరుగుతోందో..స్థానికంగా డప్పు వేసి..ఇతర మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలపాలని సీఎం ఆదేశించారు. ఈ సంధర్భంగా గవర్నర్ నరసింహన్ కు ఆహ్వానం పంపి..ఏదైనా ఒక జిల్లాలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని  ఆహ్వానించనున్నారు. 10వ తేదీన ఇందిరానగర్‌లో జరగనున్న సభాస్థలిని మంత్రి ఈటెల రాజేందర్ ఆదివారం సందర్శించి..ఏర్పాట్లను పర్యవేక్షించారు.