తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ ను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్ గా బదిలికానున్నారు. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ డీకే గుప్తా డిసెంబర్ 31న పదవీ విరమణ చేయడంతో ఆ స్ధానానికి రాధాకృష్ణన్ ను బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. సీజేఐ రంగన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులతో కూడిన కొలిజియం ఈ మేరకు సిఫారసు చేసింది. కేరళకు చెందిన జస్టిస్‌ రాధాకృష్ణన్‌ గతేడాది జూలై 1న ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వచ్చారు. వచ్చిన 6 నెలలకే ఆయన బదిలీ కావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాధాకృష్ణన్‌ బదిలీ నేపథ్యంలో రెండో స్థానంలో కొనసాగుతున్న జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే)గా వ్యవహరించే అవకాశముంది.