ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు

ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదు

ఉద్యోగులు, ప్రభుత్వం వేర్వేరు కాదన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్... ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాలతో ఈటల నేతృత్వంలోని మంత్రుల కమిటీ సమావేశమై టీచర్ల సమస్యలు, సంబంధిత అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉద్యోగ సంఘాల డిమాండ్లపై నివేదికను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేస్తామని తెలిపారు. సీఎంకు తక్షణమే నివేదిక ఇస్తామని... తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్ అన్న ఈటెల... సాధ్యం కాని అంశాలను కూడా సుసాధ్యం చేశామన్నారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించటం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తారని వెల్లడించారు. 

టీచర్లకు సంబంధించిన 4 రకాల డిమాండ్లు ఉన్నాయన్నారు మంత్రి ఈటెల... బదిలీలు.., నియామకాలు, కోర్టులలో ఉన్న అంశాలు, ఉమ్మడి సర్వీస్ రూల్స్, మౌలిక వసతుల కల్పన, ఆర్ధిక పరంగా భారం పడే అంశాలుచ సీపీఎస్ విధానంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నడూ లేని విధంగా 2.50 లక్షల మందికి ఉద్యోగ భద్రత కల్పించామన్న ఆర్థిక మంత్రి... ఉద్యోగులు వేరు... ప్రభుత్వం వేరు అనే భావన తమకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిస్తోందని... దీనిలో ఉద్యోగుల పాత్ర చాలా కీలకమన్నారు. టీచర్ల బదిలీలు ఉంటాయని స్పష్టం చేసిన ఈటల రాజేందర్... ఎటువంటి అవకతవకలు లేకుండా బదిలీలు జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.