మనోళ్లు కోడి గుడ్లు లాగిస్తున్నారు..!

మనోళ్లు కోడి గుడ్లు లాగిస్తున్నారు..!

చుక్కా, ముక్కే కాదు... కోడిగుడ్ల వినియోగంలోనూ తెలంగాణ ముదంజలో ఉంది. నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌) నివేదిక ప్రకారం... తెలంగాణ రాష్ట్రంలోనే కోడి గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో కోడిగుడ్ల తలసరి వినియోగం ఏడాదికి 180 అని తేల్చింది నెక్ నివేదిక... ఇది జాతీయ పౌష్ఠికాహార సంస్థ(ఎన్‌ఐఎన్‌) చెప్పిన తలసరి వినియోగానికి సమానం అని తన నివేదికలో పేర్కొంది నెక్. ఈ నివేదిక ప్రకారం కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ టాప్‌ స్పాట్‌లో నిలిచింది. ఇక దేశ వ్యాప్తంగా రోజుకు 22 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుండగా.. అందులో తెలంగాణ వాటా 3.2 కోట్లు అని నెక్‌ తేల్చింది. తెలంగాణ రోజుకు 1.7కోట్ల కోడిగుడ్లను వినియోగిస్తుండగా.. అందులో హైదరాబాద్‌లోనే 55 లక్షల కోడిగుడ్లను లాగించేస్తున్నారట. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే గుడ్ల వినియోగం ఎక్కువగా ఉంది. మరోవైపు పక్కనే ఉన్న ఏపీలో మాత్రం కోడిగుడ్ల తలసరి వినియోగం 119 మాత్రమేనని నెక్ నివేదిక తేల్చింది. ఈ జాబితాలో 123 కోడిగుడ్ల తలసరి వినియోగంతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా... మూడోస్థానంలో ఏపీ, వరుసగా తర్వాతి స్థానల్లో కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఛత్తీ‌స్‌గఢ్‌ నిలిచింది. ఇక తలపకి 12 కోడిగుడ్ల వినియోగంతో రాజస్థాన్‌ ఈ జాబితాలో చివరన ఉంది.