ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష

ఆగస్టులో పోలీసు ఉద్యోగాలకు రాత పరీక్ష

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన పోలీస్‌ శాఖలోని ఎస్సై, కానిస్టేబుళ్లతో పాటు ఆయా విభాగాల్లో 18,428 పోస్టుల భర్తీకి సంబందించిన రాత పరీక్షను ఆగస్టులో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పోలీస్‌ నియామక బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. ఓ కార్యక్రమానికి హాజరయిన ఆయన పోలీస్ రాత పరీక్షకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు, రాతపరీక్ష, దేహదారుఢ్య వంటి వాటికి సంబంధించిన సందేహాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో సూచించిన హెల్ప్‌లైన్‌ నెంబర్లకు కాల్ చేసి కనుక్కోమని సూచించారు. అంతే కానీ ఇతరుల్ని ఆశ్రయించి మోసపోవద్దని శ్రీనివాసరావు తెలిపారు.

మొత్తం పోలీసు నియామకాల్ని ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 9న ప్రారంభమైన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ 30తో ముగుస్తుంది. అయితే ఒకసాగారి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన దరఖాస్తును ఎడిట్ చేసే అవకాశం లేకపోవడంతో.. తప్పులు దొర్లుతాయేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ ముగిశాక తప్పిదాలు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.