షూటింగ్ స్పాట్‌లో బాలయ్యతో టి.టీడీపీ నేతల భేటీ...

షూటింగ్ స్పాట్‌లో బాలయ్యతో టి.టీడీపీ నేతల భేటీ...

ఓవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు నటుడిగా నందమూరి బాలకృష్ణ బిజీ... ఇక ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకుని స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. దొరికిన కొంత గ్యాప్‌లో ఆయన ఖమ్మం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి మంచి స్పందన రావడంతో మరికొన్ని ప్రాంతాల్లో బాలయ్యతో ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చిన టి.టీడీపీ నేతలు... ఇవాళ హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌లో ఉన్న బాలయ్యతో భేటీఅయ్యారు. ఈ సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ప్రచారానికి వచ్చిన స్పందనను బాలయ్య దృష్టికి తీసుకెళ్లిన నేతలు... ప్రచారానికి మరింత సమయంల ఇవ్వాలని కోరారు. తెలంగాణ అన్ని ప్రాంతాల్లో వీలు కాకపోతే కనీసం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అయినా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీకి టి.టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణతో పాటు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మరికొందరు ముఖ్యనేతలు హాజరయ్యారు. బాలయ్యతో దాదాపు గంట పాటు చర్చలు జరిపారు నేతలు.