ప్రపంచకప్‌ బంతి పేరు 'టెల్‌స్టార్‌ 18'

ప్రపంచకప్‌ బంతి పేరు 'టెల్‌స్టార్‌ 18'

జూన్ 14 నుండి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభమవనుంది. ఈ టోర్నీలో వాడే బంతి పేరు 'టెల్‌స్టార్‌ 18'గా నిర్ణయించారు. 1970లో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ కోసం తొలిసారిగా తయారు చేసిన బంతికి 'టెల్‌స్టార్‌' అని పేరు పెట్టారు. అప్పటి ఫుట్‌బాల్ బంతికి కొనసాగింపుగా.. 2018 సంవత్సరం గుర్తుగా.. ప్రస్తుత టోర్నీలో వాడే బంతికి 'టెల్‌స్టార్‌ 18' అని పేరు పెట్టారు. 1970 నుంచి ప్రపంచకప్‌ కోసం ప్రముఖ అడిడాస్‌ సంస్థ బంతులను తయారు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఉపయోగించే బంతులను చైనా, పాకిస్థాన్‌ లలో తయారు చేయించారు. 215 గ్రాముల బరువు కలిగి ఉన్న బంతిపై ఆరు ప్యానెల్స్‌ ను రూపొందించారు. 

Photo: FileShot