తెలుగు యాత్రికులు క్షేమం

తెలుగు యాత్రికులు క్షేమం

చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి చిక్కుపోయిన తెలుగు యాత్రికులు క్షేమంగా ఉన్నారు. వాతావరణం అనుకూలించడంతో కృష్ణగుండం నుంచి బద్రీనాథ్‌కు వెళ్తున్నారు. అయితే బస్సు ఇంకా మంచులోనే కూరుకు పోయిఉన్నట్టు సమాచారం... ప్రస్తుతం అక్కడ వర్షం ఆగిపోయి... వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ రోజు బద్రీనాథ్‌ దర్శనం చేసుకుని యాత్రికులు తిరుగు ప్రయాణం కానున్నారు. 

మరోవైపు  శ్రీకాకుళం జిల్లాకు చెందిన 10 మంది మండల అధ్యక్షులు, 12 మంది జెడ్‌పీటీసీలు, ఇతర అధికారులు, సహాయక సిబ్బంది కలిపి మొత్తం 39 మంది ఉత్తరాఖండ్ లో “ఉపాధి హామీ పథకం” అమలు తీరుతెన్నులపై అధ్యయనం చేసేందుకు మే నెల 3 వ తేదీన వెళ్లారు. బద్రీనాథ్‌, కేదారనాథ్ వెళ్లి తిరుగుప్రయాణ మయ్యారు. నిన్న సీతాపూర్ కు చేరుకున్న వీరంతా, ఈ మధ్యాహ్నం కల్లా హరిద్వార్ కు చేరుకుంటారని అధికారులు చెబుతున్నారు.